Dalitha Dalam Dr.B.R.AMBEDKAR JYOTHIRAO PULE BABU JAGJEEVAN RAM DAMODARAM SANJEEVAYYA KANSHIRAM SAVITHRI BHAI PULE Dalitha Dalam Dalitha Dalam Dr.Talathoti Prithvi Raj Tummapudi Niranjan Kumar D.Willium John Victor P.Venkata Sudhakar M.Kondala Rao K.V.S.Maheswara Rao N.Syamala J.Sambrajyam Dalitha Dalam DALIT POETS KUSUMA DHARMANNA GURRAM JASHUVA BOYI BHEEMANNA JALADI RAJA RAO S.T.JNANANANDA KAVI BOYA JANGAYYA SIVA SAGAR MADDURI NAGESH BABU KALEKURI PRASAD PAIDI TERESH BABU DALIT POETS
కులపిచ్చి మాకు నాస్తి! ఆత్మ గౌరవమే మా ఆస్తి!! ~ డా. తలతోటి పృథ్వీ రాజ్         దళితులంటే పోరాట వీరులు! మోసాలను సవాళ్ళను ఎదుర్కోగల ధీరులు ~ డా. తలతోటి పృథ్వి రాజ్         ఆత్మ గౌరవం మా దళితుల ఆస్తి! కుల వివక్షత లేనివారితోనే మా దోస్తీ ~డా. తలతోటి పృథ్వి రాజ్         నిజాలే... మా ఇజాలు... ~ డా. తలతోటి పృథ్వీ రాజ్         అగ్రవర్ణాలవారని అనకండి! అందరూ సమానమేనని గ్రహించండి!! ~డా. తలతోటి పృథ్వి రాజ్         తరాల వివక్షకు ప్రతిరూపాలం! భావితరాలా స్వేచ్చా కాముకులం!! ~ డా. తలతోటి పృథ్వీ రాజ్         అంబేడ్కరిజమంటే సమతా భావం! దళితులకదే జీవం!! ~ డా. తలతోటి పృథ్వీ రాజ్         దళితులను అణిచి వేయాలనుకోవడమంటే~రాజ్యాంగ సౌధాన్నీ కూల్చివేయాలనుకోవడమే ~ డా. తలతోటి పృథ్వీ రాజ్         కుల వివక్ష మానుకోండి! సిసలైన మనిషిగా నిరూపించుకోండి!! ~ డా. తలతోటి పృథ్వీ రాజ్         అంబేడ్కర్ వారసులం! అసమానతలను ప్రశ్నించే యోధులం!! ~ డా. తలతోటి పృథ్వీ రాజ్         ఉన్నంతలో ఉన్నతంగా జీవించండి! బిడ్డలా ఉన్నత స్థితికి మెట్లువెయ్యండి ~డా. తలతోటి పృథ్వి రాజ్         దళితులంటే పోరాట వీరులు! మోసాలను సవాళ్ళను ఎదుర్కోగల ధీరులు ~ డా. తలతోటి పృథ్వి రాజ్         అంబేడ్కర్ వారసులం! కుల వివక్షతపై పిడికిళ్ళం!! ~డా.తలతోటి పృథ్వి రాజ్         మనువాదుల గుండెల్లో గునపాలం! దళితజాతి సిగలో గులాబీలం!! ~డా. తలతోటి పృథ్వి రాజ్         ఒక్కో దళితుడు ఒక్కో కిరణమైతే కులవివక్షత చీకట్లు పటాపంచలే ~డా. తలతోటి పృథ్వి రాజ్         అంబేడ్కర్ జీవితపాఠాన్ని చెప్పండి! మన జీవిత నావకు దిక్సూచి అని తెలపండి ~డా. తలతోటి పృథ్వి రాజ్

ABOUT DALITHA DALAM

వ్యవస్థాపన నేపథ్యం 
     దళిత జాతిది పోరాటాల చరిత్ర . దళిత బిడ్డలు మంచి బట్టలు ధరించినా , మంచి తిండి తిన్నా, మంచి చదువులు చదివినా, మంచి ఉద్యోగం చేస్తున్నా, మంచి ఇల్లు కట్టుకున్నా, కార్లల్లో తిరిగినా దళితేతరుల్లోని అనేకులకు అసూయ, ద్వేషం.  సందర్భం ఎలాంటిదైనా నిసిగ్గుగా దళిత బిడ్డల్ని పాతాళానికి తొక్కెయ్యడానికి సమయంకోసం ఎదురు చూస్తారు కొందరు దళితేతరులు.
     ఏ ఎం ఏ ఎల్ కళాశాలలో పదిమంది వరకు దళిత అధ్యాపకులు ఉనారన్న సంగతి అనకాపల్లిలోని స్థానిక దళిత నాయకులకు కూడా 2000 సంవత్సరం నుండి 2015 సంవత్సరం వరకు తెలియదంటే కులాలకతీతంగా ఎవరి ఉద్యోగ బాధ్యతల్లో వారు ... ఎవరి సంసార భాద్యతలలో వారు తలమునకలై ఎలా 15 సంవత్సరాల పాటుఎలా బతికేసామో ఇట్టే అర్థం చేసుకోవచ్చు . ఒక కోణంలో మేము ఆవిధంగా ఉండడం కూడా  మేము చేసిన తప్పు అని లోకం తీరును బట్టి, జరిగిన పరిణామాలను బట్టి అర్థమైంది . ఇటువంటి పరిస్థితుల్లో మేము పనిచేసి కళాశాల కార్యవర్గ సభ్యుల్లో ఒక మహానుభావుడు మా మీద కులం ముద్రవేసి కీడు చెయ్యాలని  ఎంతగానో ప్రయత్నం చేశాడు.  అతగాడి అవివేకానికి నవ్వుకున్నాము . మాకు కీడు చెయ్యబోయి ఆయనకు తెలియకుండానేమాకు మేలు చేసాడు .  ఎవరి మానాన వారు అన్నట్లుగా ఉండే మమ్మలి ఐక్య మయ్యేలా తన పిచ్చి చర్యలతో ఐక్యపరిచాడు. ఇదే ఆయన చేసిన మేలు.  నిత్యచైతన్య శీలురుగా ఉండేలా తన అహంభావ చర్యలతో మమ్మల్ని సమాయత్త పరిచాడు.
      అసలే కోతి, ఆపై కల్లు తాగితే అన్నట్లు ఇటువంటి వ్యక్తికి మరొక శకుని తోడై మా దళిత అధ్యాపకులను ఇంకా అణగదొక్కాలని  వ్యూహాలు రచించారు. తెరవెనుక, తెరముందు వ్యూహకర్తలు... సూత్రదారులు... అమలుపరిచేవారు ... వందిమాగాదులు... ఇలా ఎందరో కుయుక్తులు పన్నుతున్న సమయంలో; ఇటువంటి సందర్భంలోనుంచి పుట్టిన ఆలోచనల్లోనుంచి పుట్టినదే ఈ సంస్థ . దళిత దళం అనేదానికి ముందు “అనకాపల్లి దళిత సంక్షేమ సంఘం” పేరుతో కొన్ని కార్యక్రమాలు నిర్వహించినా, దళిత దళం పేరుతో వాట్సాప్ గ్రూప్ రూపొందించి దళితులలో స్పూర్తిని నిలిపిన ఆ “దళిత దళం “ పేరుతోనే కార్యక్రమాలు కొనసాగించాలని నిశ్చయించుకున్నాము .  
     అన్ని కులాల వాళ్ళ లాగే మేమూ మా  జాతి అభ్యున్నతికి పాటుపడాలనే ఆలోచనతో వేసిన తొలి అడుగు, చేసిన తొలి కార్యక్రమం డా . బి .ఆర్. అంబేడ్కర్ 125 వ జయంతి  సమావేశం. ఈ సమావేశంకూడా మేము పనిచేసే ఏ ఎం ఏ ఎల్ కాలేజీ జంక్షన్ లో చేసాము.  అతి తక్కువ వ్యవధి లోనే అనేక కార్యక్రమాలను నిర్వహించాము, దళితనాయకులతో పాల్గొన్నాము.
     ఈ రోజు దళిత ఆధ్యాపకులుగా, మేథావి వర్గంగా మాముందు అనేక లక్ష్యాలు ఉన్నాయి . పదిహేను సంవత్సరాలలో మేము పొందని అనుభూతిని నేడు పొందుతున్నాము . మేము చేసే కార్యక్రమాలను బట్టి మాకు మేమే గర్వపడుతున్నాము . దళిత నాయకుల అభినందనలను అందుకుంటున్నాము . ఈ క్రమంలో...ఈ పోరాట ప్రయాణంలో అనేకమంది దళిత  ప్రజా ప్రతినిధులు , దళిత అధికారులు పరిచయం అయ్యారు . ఇదంతా ఆయనగారి చలవే. కొందరి అజ్ఞానం కూడా కొన్ని సందర్భాలలో కొందరికి మేలు చేస్తుంది అనడానికి ఇదే ఉదాహరణ .

     ఏది ఏమైనా  అంబేద్కర్ ఆశయ సాధనకై దళిత దళం మునుముందు అనేక కార్యక్రమాలు చేస్తూ దళితుల్లో చైతన్యం కలుగచేస్తూ పనిచేస్తుందని హామీ ఇస్తున్నాము . 
                                                                 ~ దళిత దళం 

No comments:

Post a Comment