Dalitha Dalam Dr.B.R.AMBEDKAR JYOTHIRAO PULE BABU JAGJEEVAN RAM DAMODARAM SANJEEVAYYA KANSHIRAM SAVITHRI BHAI PULE Dalitha Dalam Dalitha Dalam Dr.Talathoti Prithvi Raj Tummapudi Niranjan Kumar D.Willium John Victor P.Venkata Sudhakar M.Kondala Rao K.V.S.Maheswara Rao N.Syamala J.Sambrajyam Dalitha Dalam DALIT POETS KUSUMA DHARMANNA GURRAM JASHUVA BOYI BHEEMANNA JALADI RAJA RAO S.T.JNANANANDA KAVI BOYA JANGAYYA SIVA SAGAR MADDURI NAGESH BABU KALEKURI PRASAD PAIDI TERESH BABU DALIT POETS
కులపిచ్చి మాకు నాస్తి! ఆత్మ గౌరవమే మా ఆస్తి!! ~ డా. తలతోటి పృథ్వీ రాజ్         దళితులంటే పోరాట వీరులు! మోసాలను సవాళ్ళను ఎదుర్కోగల ధీరులు ~ డా. తలతోటి పృథ్వి రాజ్         ఆత్మ గౌరవం మా దళితుల ఆస్తి! కుల వివక్షత లేనివారితోనే మా దోస్తీ ~డా. తలతోటి పృథ్వి రాజ్         నిజాలే... మా ఇజాలు... ~ డా. తలతోటి పృథ్వీ రాజ్         అగ్రవర్ణాలవారని అనకండి! అందరూ సమానమేనని గ్రహించండి!! ~డా. తలతోటి పృథ్వి రాజ్         తరాల వివక్షకు ప్రతిరూపాలం! భావితరాలా స్వేచ్చా కాముకులం!! ~ డా. తలతోటి పృథ్వీ రాజ్         అంబేడ్కరిజమంటే సమతా భావం! దళితులకదే జీవం!! ~ డా. తలతోటి పృథ్వీ రాజ్         దళితులను అణిచి వేయాలనుకోవడమంటే~రాజ్యాంగ సౌధాన్నీ కూల్చివేయాలనుకోవడమే ~ డా. తలతోటి పృథ్వీ రాజ్         కుల వివక్ష మానుకోండి! సిసలైన మనిషిగా నిరూపించుకోండి!! ~ డా. తలతోటి పృథ్వీ రాజ్         అంబేడ్కర్ వారసులం! అసమానతలను ప్రశ్నించే యోధులం!! ~ డా. తలతోటి పృథ్వీ రాజ్         ఉన్నంతలో ఉన్నతంగా జీవించండి! బిడ్డలా ఉన్నత స్థితికి మెట్లువెయ్యండి ~డా. తలతోటి పృథ్వి రాజ్         దళితులంటే పోరాట వీరులు! మోసాలను సవాళ్ళను ఎదుర్కోగల ధీరులు ~ డా. తలతోటి పృథ్వి రాజ్         అంబేడ్కర్ వారసులం! కుల వివక్షతపై పిడికిళ్ళం!! ~డా.తలతోటి పృథ్వి రాజ్         మనువాదుల గుండెల్లో గునపాలం! దళితజాతి సిగలో గులాబీలం!! ~డా. తలతోటి పృథ్వి రాజ్         ఒక్కో దళితుడు ఒక్కో కిరణమైతే కులవివక్షత చీకట్లు పటాపంచలే ~డా. తలతోటి పృథ్వి రాజ్         అంబేడ్కర్ జీవితపాఠాన్ని చెప్పండి! మన జీవిత నావకు దిక్సూచి అని తెలపండి ~డా. తలతోటి పృథ్వి రాజ్

Friday, April 21, 2017

Dalitha Dalam Literary Award దళిత దళం సాహితీ పురస్కారం

         భారత రత్న డా . బి. ఆర్ . అంబేడ్కర్ 126 వ జయంతిని పురస్కరించుకొని ఏ ఎం. ఏ .ఎల్ . దళిత అధ్యాపక బృందం 10 ఏప్రిల్ 2017 సాయంత్రం 5 గంటలకు ‘ ఫెయిత్ హోమ్ ‘ లో  సమావేశాన్ని నిర్వహించడం జరిగినది.  ఈ సమావేశానికి ఆంధ్ర విశ్వవిద్యాలయం , ఆంథ్రోపాలజీ శాఖాధ్యక్షులు, దళిత మేధావి ఆచార్య పి .డి.సత్యపాల్ ముఖ్య అతిథిగా, వక్తగా విచ్చేశారు .  లక్షిం పేట నరమేధంపై స్పందిస్తూ ‘నెత్తుటి మరకలు ‘ అనే దీర్ఘకవితా సంపుటిని రచించిన దళిత కవి శ్రీ నేలపూరి రత్నాజీ ని కూడా మరో అతిథిగా ఆహ్వానించడం జరిగినది . దళితులపట్ల జరుగుతున్న దాడులను నిరసిస్తూ ... ప్రత్యేకించి లక్షిం పేట సంఘటనపై అద్భుతంగా తన వాణిని వినిపించిన కవి నేలపూరి రత్నాజీ ని గుర్తించి ప్రోత్సహించాలనే ఉద్దేశ్యంతో ‘’ దళిత దళం సాహితీ పురస్కారాన్ని ‘  రత్నాజీ కి ప్రదానం చెయ్యడమైనది.
        దళితుల సమస్యలూ – పరిష్కార మార్గాలు ‘ అనే అంశంపై ముఖ్య వక్తగా పాల్గొని ప్రసంగించిన ఆచార్య పి.డి.సత్యపాల్ కుల వ్యవస్థ గూర్చి ...ఏవిధంగా దళితులను అణిచి వేశారు , దళితుల హక్కుల కోసం అంబేడ్కర్ చేసిన కృషి... మొదలగున్న అనేక విషయాలను ఆద్యంతం ఆసక్తికరంగా సభను రంజింప జేస్తూ ఉపన్యసించారు.

ఈ కార్యక్రమంలో స్థానిక దళిత నాయకులు కొండబాబు మాష్టారు, మంగరాజు , చంద్రశేఖర్ , తదితరులే గాక ఏ . ఎం . ఏ. ఎల్ కళాశాల దళిత అధ్యాపకులు డి విలియం జాన్ విక్టర్ , లెఫ్ . ఎం. కొండల రావు , పేరం వెంకట సుధాకర్ , కె వి .ఎస్. మహేశ్వర రావు , తుమ్మపూడి నిరంజన్ కుమార్ , శ్రీమతి ఎన్ శ్యామల , శ్రీమతి జె .సామ్రాజ్యం కుటుంబ సభ్యులు పాల్గొన్నారు . అనంతరం డా . తలతోటి పృథ్వి రాజ్ ఏర్పాటు చేసిన విందు భోజనాన్ని స్వీకరించి సభను విజయవంతం చెయ్యడమైనది .   ~ ఏ ఎం. ఏ .ఎల్ . దళిత అధ్యాపక బృందం












No comments:

Post a Comment