కులపిచ్చి మాకు నాస్తి! ఆత్మ గౌరవమే మా ఆస్తి!! ~ డా. తలతోటి పృథ్వీ రాజ్         దళితులంటే పోరాట వీరులు! మోసాలను సవాళ్ళను ఎదుర్కోగల ధీరులు ~ డా. తలతోటి పృథ్వి రాజ్         ఆత్మ గౌరవం మా దళితుల ఆస్తి! కుల వివక్షత లేనివారితోనే మా దోస్తీ ~డా. తలతోటి పృథ్వి రాజ్         నిజాలే... మా ఇజాలు... ~ డా. తలతోటి పృథ్వీ రాజ్         అగ్రవర్ణాలవారని అనకండి! అందరూ సమానమేనని గ్రహించండి!! ~డా. తలతోటి పృథ్వి రాజ్         తరాల వివక్షకు ప్రతిరూపాలం! భావితరాలా స్వేచ్చా కాముకులం!! ~ డా. తలతోటి పృథ్వీ రాజ్         అంబేడ్కరిజమంటే సమతా భావం! దళితులకదే జీవం!! ~ డా. తలతోటి పృథ్వీ రాజ్         దళితులను అణిచి వేయాలనుకోవడమంటే~రాజ్యాంగ సౌధాన్నీ కూల్చివేయాలనుకోవడమే ~ డా. తలతోటి పృథ్వీ రాజ్         కుల వివక్ష మానుకోండి! సిసలైన మనిషిగా నిరూపించుకోండి!! ~ డా. తలతోటి పృథ్వీ రాజ్         అంబేడ్కర్ వారసులం! అసమానతలను ప్రశ్నించే యోధులం!! ~ డా. తలతోటి పృథ్వీ రాజ్         ఉన్నంతలో ఉన్నతంగా జీవించండి! బిడ్డలా ఉన్నత స్థితికి మెట్లువెయ్యండి ~డా. తలతోటి పృథ్వి రాజ్         దళితులంటే పోరాట వీరులు! మోసాలను సవాళ్ళను ఎదుర్కోగల ధీరులు ~ డా. తలతోటి పృథ్వి రాజ్         అంబేడ్కర్ వారసులం! కుల వివక్షతపై పిడికిళ్ళం!! ~డా.తలతోటి పృథ్వి రాజ్         మనువాదుల గుండెల్లో గునపాలం! దళితజాతి సిగలో గులాబీలం!! ~డా. తలతోటి పృథ్వి రాజ్         ఒక్కో దళితుడు ఒక్కో కిరణమైతే కులవివక్షత చీకట్లు పటాపంచలే ~డా. తలతోటి పృథ్వి రాజ్         అంబేడ్కర్ జీవితపాఠాన్ని చెప్పండి! మన జీవిత నావకు దిక్సూచి అని తెలపండి ~డా. తలతోటి పృథ్వి రాజ్

Friday, April 21, 2017

Dalitha Dalam Literary Award దళిత దళం సాహితీ పురస్కారం

         భారత రత్న డా . బి. ఆర్ . అంబేడ్కర్ 126 వ జయంతిని పురస్కరించుకొని ఏ ఎం. ఏ .ఎల్ . దళిత అధ్యాపక బృందం 10 ఏప్రిల్ 2017 సాయంత్రం 5 గంటలకు ‘ ఫెయిత్ హోమ్ ‘ లో  సమావేశాన్ని నిర్వహించడం జరిగినది.  ఈ సమావేశానికి ఆంధ్ర విశ్వవిద్యాలయం , ఆంథ్రోపాలజీ శాఖాధ్యక్షులు, దళిత మేధావి ఆచార్య పి .డి.సత్యపాల్ ముఖ్య అతిథిగా, వక్తగా విచ్చేశారు .  లక్షిం పేట నరమేధంపై స్పందిస్తూ ‘నెత్తుటి మరకలు ‘ అనే దీర్ఘకవితా సంపుటిని రచించిన దళిత కవి శ్రీ నేలపూరి రత్నాజీ ని కూడా మరో అతిథిగా ఆహ్వానించడం జరిగినది . దళితులపట్ల జరుగుతున్న దాడులను నిరసిస్తూ ... ప్రత్యేకించి లక్షిం పేట సంఘటనపై అద్భుతంగా తన వాణిని వినిపించిన కవి నేలపూరి రత్నాజీ ని గుర్తించి ప్రోత్సహించాలనే ఉద్దేశ్యంతో ‘’ దళిత దళం సాహితీ పురస్కారాన్ని ‘  రత్నాజీ కి ప్రదానం చెయ్యడమైనది.
        దళితుల సమస్యలూ – పరిష్కార మార్గాలు ‘ అనే అంశంపై ముఖ్య వక్తగా పాల్గొని ప్రసంగించిన ఆచార్య పి.డి.సత్యపాల్ కుల వ్యవస్థ గూర్చి ...ఏవిధంగా దళితులను అణిచి వేశారు , దళితుల హక్కుల కోసం అంబేడ్కర్ చేసిన కృషి... మొదలగున్న అనేక విషయాలను ఆద్యంతం ఆసక్తికరంగా సభను రంజింప జేస్తూ ఉపన్యసించారు.

ఈ కార్యక్రమంలో స్థానిక దళిత నాయకులు కొండబాబు మాష్టారు, మంగరాజు , చంద్రశేఖర్ , తదితరులే గాక ఏ . ఎం . ఏ. ఎల్ కళాశాల దళిత అధ్యాపకులు డి విలియం జాన్ విక్టర్ , లెఫ్ . ఎం. కొండల రావు , పేరం వెంకట సుధాకర్ , కె వి .ఎస్. మహేశ్వర రావు , తుమ్మపూడి నిరంజన్ కుమార్ , శ్రీమతి ఎన్ శ్యామల , శ్రీమతి జె .సామ్రాజ్యం కుటుంబ సభ్యులు పాల్గొన్నారు . అనంతరం డా . తలతోటి పృథ్వి రాజ్ ఏర్పాటు చేసిన విందు భోజనాన్ని స్వీకరించి సభను విజయవంతం చెయ్యడమైనది .   ~ ఏ ఎం. ఏ .ఎల్ . దళిత అధ్యాపక బృందం
Thursday, April 20, 2017

Dr. B.R.Ambedkar 126th Birth Anniversary Celebrations-A.M.A.L.College Dalith Lecturers-Anakapalli

     భారత రత్న డా . బి . ఆర్ . అంబేద్కర్ 126 వ జయంతి ఉత్సవ  కార్యక్రమం అనకాపల్లి , ఏ ఎం ఏ ఎల్ కళాశాల జంక్షన్ వద్ద నిర్వహించబడ్డాయి . ఈ  కార్యక్రమంలో  ఏ ఎం ఏ ఎల్ కళాశాల దళిత అధ్యాపకులు డా తలతోటి పృథ్వీ రాజ్ , తుమ్మపూడి నిరంజన్ కుమార్ , డి విలియం జాన్ విక్టర్ , లెఫ్ . ఎం . కొండలరావు, పి వి సుధాకర్ , కే వి ఎస్ మహేశ్వర రావు , శ్యామల , సామ్రాజ్యం గారి భర్త జానకీరాం, శ్యామల భర్త రమేష్ గార్లు పాల్గొన్నారు . మొదట డా తలతోటి పృథ్వీ రాజ్ – గ్యాస్ అప్పారావు సంయుక్తంగా అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేయగా, అనంతరం తుమ్మపూడి నిరంజన్ కుమార్ తదితరులు మరో చిత్రపటానికి పూలమాలవేసి నివాళి అర్పించారు.   జగ్జీవన్ రామ్ కి నివాళి అర్పించారు. ఈ కార్యక్రమంలో స్థానిక దళిత నాయకులు పాల్గొన్నారు. అనంతరం అనకాపల్లి ప్రభుత్వ ఆసుపత్రి సూపరిండెంట్ డా . జగన్మోహన్ గారు హాజరయ్యారు . ఈ సందర్భంగా పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమం నిర్వహించ బడింది. చీరల పంపిణీ జరిగింది. ఈ కార్యక్రమం లో మేడిశెట్టి నూకరాజు , వై ఎస్ అర్పి నాయకుడు జగన్ , తదితర బిసి నాయకులు , ఎస్సీ నాయకులు పాల్గొన్నారు . ఈ కార్యక్రమానికి ఏ ఎం ఏ ఎల్ కళాశాల దళిత అధ్యాపకులు తమవంతు ఆర్ధిక సహాయాన్ని కొంత అందించారు.
Babu Jagjeevan Ram 110th Birth Anniversary by A.M.A.L.College Dalith Lecturerrs, Anakapalli

     బాబూ జగ్జీవన్ రావ్ 110 వ జయంతిని పురస్కరించుకొని  ఏ ఎం ఏ ఎల్ కళాశాల జంక్షన్ లో కార్యక్రమాన్ని ఏర్పాటు చెయ్యడమైనది .తొలుత జగ్జీవన్ రామ్ చిత్ర పటానికి పృథ్వీ రాజ్ , మంగరాజులు పూలమాలవేసి నివాళి అర్పించారు.  ఈ కార్యక్రమానికి ఏ ఎం ఏ ఎల్ కళాశాల దళిత అధ్యాపకులు డా తలతోటి పృథ్వీ రాజ్ , తుమ్మపూడి నిరంజన్ కుమార్ , డి విలియం జాన్ విక్టర్ , లెఫ్ . ఎం . కొండలరావు, పి .వెంకట సుధాకర్, జె . జానకీరాం  మరియు స్థానిక దళిత నాయకులు కొండబాబు మాస్టర్ , గ్యాస్ అప్పారావు , రాము మొదలగున్న వారు పాల్గొన్నారు . ఈ సందర్భంగా మాజీ  తొలి దళిత ఉపప్రధాని జగ్జీవన్ రామ్ గూర్చి డా . తలతోటి పృథ్వీ రాజ్ ప్రసంగించారు . 

Babu Jagjeevan Ram 110th Birth Anniversary-A.M.A.L.College Dalith Lecturers, Anakapalli

5 ఏప్రిల్ 2017 ఉదయం, బాబూ జగ్జీవన్ రావ్ 110 వ జయంతిని పురస్కరించుకొని  అనకాపల్లి చోడవరం బస్సు స్టాప్ వద్ద  ఎమ్మార్పియస్ నాయకుడు మంగరాజు ఏర్పాటు చేసిన విగ్రహావిష్కరణ కార్యక్రమానికి, ఆయన ఆహ్వానం మేరకు  దళిత అధ్యాపకులు పాల్గొనడం జరిగినది .  తొలుత పట్టణ సి ఐ  విద్యాసాగర్ బాబూ జగ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించగా , అనంతరం ఏ ఎం ఏ ఎల్ కళాశాల దళిత అధ్యాపకులు డా తలతోటి పృథ్వీ రాజ్ , తుమ్మపూడి నిరంజన్ కుమార్ , డి విలియం జాన్ విక్టర్ , లెఫ్ . ఎం . కొండలరావు జగ్జీవన్ రామ్ కి నివాళి అర్పించారు. ఈ కార్యక్రమంలో స్థానిక దళిత నాయకులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ఏ ఎం ఏ ఎల్ కళాశాల దళిత అధ్యాపకులు తమవంతు ఆర్ధిక సహాయాన్ని కొంత అందించారు .

Dr Ambedkar 60th death anniversary-Dalitha Dalam-A.M.A.L.College Dalith Lecturers, Anakapalli

     దళిత దిక్సూచి, దళిత స్ఫూర్తి ప్రదాత డా . బి ఆర్ అంబేద్కర్ 60వ వర్థంతి కార్యక్రమం 6 డిసెంబర్ 2016 న ఏ ఎం ఏ ఎల్ కళాశాల జంక్షన్ లో నిర్వహించ బడినది.  ఈ కార్యక్రమంలో ఏ ఎం ఏ ఎల్ కళాశాల దళిత అధ్యాపకులు డా తలతోటి పృథ్వీ రాజ్ , తుమ్మపూడి నిరంజన్ కుమార్ , డి విలియం జాన్ విక్టర్ , లెఫ్ . ఎం . కొండలరావు, పి .వెంకట సుధాకర్, జె . జానకీరాం  మరియు స్థానిక దళిత నాయకులు కొండబాబు మాస్టర్ , గ్యాస్ అప్పారావు , రాము మొదలగున్న వారు పాల్గొన్నారు.


Blankets Distribution by A.M.A.L.College Dalith Lecturers, Ummalada,Anakapalli

      శీతాకాలాన్ని దృష్టిలో పెట్టుకొని దళిత పేదలను చలినుంచి దళిత వృద్ధులను సంరక్షించాలనే సదుద్దేశంతో 12 డిసెంబర్ 2016న   ఏ ఎం ఏ ఎల్ కళాశాల దళిత అధ్యాపకులు డా తలతోటి పృథ్వీ రాజ్ , తుమ్మపూడి నిరంజన్ కుమార్ , డి విలియం జాన్ విక్టర్ , లెఫ్ . ఎం . కొండలరావు, పి వెంకట సుధాకర్ , కె వి ఎస్ మహేశ్వర రావు , శ్యామల, జె సామ్రాజ్యం దుప్పట్ల పంపిణీ కార్యక్రంమాన్ని చేపట్టారు. అనకాపల్లి లోని ఉమ్మలాడ పంచాయితీ లోని ఎస్సీ కోలని లో పేద దళితులకు దుప్పట్ల పంపిణి చెప్పట్టారు. తొలుత కోలని లోని అంబేద్కర్ విగ్రహానికి డా . తలతోటి పృథ్వీ రాజ్ , తుమ్మపూడి నిరంజన్ కుమార్ బృందం పూలమాలవేసి నివాళి అర్పించి , జై భీమ్ నినాదాలు చేసి   స్థానిక మాల మహానాడు జిల్లా నాయకులు శ్రీ కంకణాల శ్రీనివాసరావు ఆధ్యక్షతన ఈ పంపిణీ కార్యక్రమం జరిగింది. అనకాపల్లి దళిత నాయకులు పావాడ కామరాజు , మంగరాజు, గ్యాస్ అప్పారావు మొదలగు వారి చేతుల మీదుగా దుప్పట్లను పంచడం జరిగినది.అంబేడ్కర్ చితాబస్మ రథ యాత్ర - దళిత దళం - ఏ.ఏ.ఏ.ఎల్. కళాశాల

     ౩డిసెంబర్ 2016 న రాష్ట వ్యాప్తంగా పర్యటించే అంబేడ్కర్ చితా భస్మం తో కూడిన రథానికి పూడిమడక జంక్షన్ వద్ద ఏ ఎం ఏ ఎల్ కళాశాల దళిత అధ్యాపకులు డా తలతోటి పృథ్వీ రాజ్ , తుమ్మపూడి నిరంజన్ కుమార్ , డి విలియం జాన్ విక్టర్ , లెఫ్ . ఎం . కొండలరావు, పి వెంకట సుధాకర్ , కె వి ఎస్ మహేశ్వర రావు , శ్యామల, జె సామ్రాజ్యం స్వాగతం పలుకుతూ ఆహ్వానించారు . వీరితో పాటు స్థానిక దళిత నాయకులు కామరాజు , మంగరాజు, కంకణాల శ్రీనివాసరావు మొదలగున్నవారు పాల్గొన్నారు . చిత్తూరునుండి శ్రీకాకుళం వరకు సాగే రథ యాత్రలో దళిత అధ్యాపకులు పాల్గొనడం అదృష్టంగా భావించారు . దళితుల ఆశా జ్యోతి చితా బస్మాన్ని చూడగలిగే అవకాశానికి అధ్యాపకులు సంతోషించారు . అతిథులకు తేనీటి విందును ఏర్పాటు చేసారు.  ఈ రథం వెంట డాక్టా రాష్ట్ర నాయకులు ఏ  వెంకటేశ్వర రావు , ఆంద్ర విశ్వ విద్యాలయం ఆచార్యులు డా . పి . డి సత్య పాల్ , అనేక దళిత నాయకులు పాల్గొన్నారు