మంచి చదువులు
చదువుకొని , మంచి ఉద్యోగాలు పొంది , మంచి జీవితాన్ని మనం పొందడమే గాక మనలా ఎస్సీ
హాస్టల్స్ లో చదువుకునే మన దళిత పిల్లలను చైతన్యవంతం చేసి చదువుల్లో వారిని రాణింప
జెయ్యాలనే ఉద్దేశంతో ఎం ఏ ఎల్ కళాశాల దళిత అధ్యాపకులు డా తలతోటి పృథ్వీ రాజ్ , తుమ్మపూడి
నిరంజన్ కుమార్ , డి విలియం జాన్ విక్టర్ , లెఫ్ . ఎం . కొండలరావు, పి వెంకట
సుధాకర్ , కె వి ఎస్ మహేశ్వర రావు , శ్యామల, జె సామ్రాజ్యం గార్లు అనకాపల్లి , కశిం కోట లోని ఎస్సీ హాస్టల్ లో 24
జులై 2016 జాషువా వర్థంతిని పురస్కరించుకొని సమావేశాన్ని నిర్వహించారు. పిల్లని
చైతన్య పరుస్తూ అధ్యాపకులు మాట్లాడడమే గాక వారికి నోట్ బుక్స్ , పెన్నులు ,
బిస్కెట్స్ పంచడం జరిగినది .
Showing posts with label dalitha dalam. Show all posts
Showing posts with label dalitha dalam. Show all posts
Thursday, April 20, 2017
Wednesday, April 19, 2017
DACTA state committee meeting hosting by Dalitha Dalam on 26th June 2016, Anakapalli
దళిత అధ్యాపకుల సమస్యల పరిష్కారార్థమే స్థాపించిన సంస్థ డాక్టా . అంటే దళిత ఎయిడెడ్ అధ్యాపకుల సంఘం. రాష్ట్రస్థాయి కార్యవర్గ సమావేశాన్ని మా అభ్యర్థన మేరకు అనకాపల్లి లో ఏ ఏం ఏ ఎల్ అధ్యాపకులుగా నిర్వహించడానికి డాక్టా రాష్ట్ర కార్యవర్గం అవకాశం కల్పించారు. 26 జూన్ 2016న నిర్వహించిన ఈ కార్యక్రమానికి దళితుల ముద్దు బిడ్డ , ఆరోగ్యశాఖ మాజీ మంత్రి వర్యులు శ్రీ కొండ్రు మురళీ గారు ముఖ్య అతిథిగా విచ్చేసారు . ఈ కార్యక్రమంలో శ్రీయుతులు డాక్టా నాయకులు డా . గోవిందు సురేంద్ర , కె . అమరేశ్వరరావు , డా . ఎ వెంకటేశ్వర రావు , డా . కె .సుధాకర్ , కె శ్రీనివాస రావు మొదలగున్నవారు పాల్గొన్నారు . అదే రీతిగా స్థానిక దళిత నాయకులు శ్రీయుతులు గ్యాస్ అప్పారావు, పావాడ కామరాజు , కంకణాల శ్రీను , పందిరి దయాళ్ రాజ్ మొదలగున్నవారు పాల్గొన్నారు .
ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న కొందరు మురళీ మాట్లాడుతూ దళితులు ఐక్యంగా ఉన్నప్పుడే సమస్యలను అధికమించవచ్చని , హక్కులను సాధించుకోవచ్చని తెలియజేసారు . అధ్యాపకుల సమస్యలపై చర్చించడానికి ఏ అధికారివద్దకైన రావడానికి తానెప్పుడూ సిద్ధమేనని ఉద్ఘాటించారు. అనంతరం డాక్టా కార్యవర్గం అనేక అంశాలపై చర్చించుకుంది . అనంతరం చక్కని విందును ఆరగించారు .
AMBEDKAR 125th BIRTH ANNIVERSARY by DALITHA DALAM AT A.M.A.L.COLLEGE JUNCTION, ANAKAPALLI
భారత రత్న డా . బి .ఆర్ . అంబెడ్కర్ 125వ జయంతి ఉత్సవాలు దళిత దళం ఆధ్వర్యంలో 14 ఏప్రిల్ 2016 న ఏ ఏం ఏ ఎల్ కళాశాల సెంటర్ వద్ద నిర్వహించ బడ్డాయి. తెలుగు శాఖ అధ్యక్షులు , కవి డా . తలతోటి పృథ్వీ రాజ్ అంబెడ్కర్ ఉద్యమ జీవితం గూర్చి ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో లో కొత్తూరు పంచాయితీ సర్పంచ్ శ్రీమతి మేడిశెట్టి రాధా, పంచాయతీ సిబ్బంది, స్థానిక బి సి నాయకులు, స్థానిక దళిత నాయకులు, బి. జె. పి. నాయకులు కొండబాబు మాస్టర్, గ్యాస్ అప్పారావు, ఏ ఏం ఏ ఎల్ కళాశాల అధ్యాపక బృందం పాల్గొన్నారు.
Subscribe to:
Posts (Atom)











